శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 12:28:45

కుర్ర హీరో క‌ల‌ని నెర‌వేర్చిన‌ ఆయ‌న త‌ల్లి

కుర్ర హీరో క‌ల‌ని నెర‌వేర్చిన‌ ఆయ‌న త‌ల్లి

త‌మిళ హీరో శింబు వ‌ర్క్ విష‌యంలో ఎంత డెడికేష‌న్‌తో ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో భారీగా వ‌ర్క‌వుట్స్ చేసి 101 కేజీల నుండి 71 కేజీల వ‌ర‌కు త‌గ్గాడ‌ట. త‌న‌లోని మార్పు త‌న‌కే షాకిచ్చింద‌ని అంటున్నాడు శింబు. త్వ‌ర‌లో ఈశ్వ‌రుడు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న శింబు ..  నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో  ఓ గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేయ‌నున్నాడు. ఇందులో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 

అయితే కొన్ని నెల‌లుగా శింబు ప‌డుతున్న క‌ష్టం, వ‌ర్క్‌పై ఆయ‌న‌కున్న అంకిత భావాన్ని చూసి మురిసిపోయిన శింబు త‌ల్లి బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు. ఇది శింబు డ్రీమ్ కార‌ని , దీని ధ‌ర దాదాపు రూ.50 లక్షలని తెలుస్తోంది. త‌ల్లి ఇచ్చిన గిఫ్ట్‌కు శింబు తెగ సంతోషించాడ‌ట‌.  శింబు ఇటీవ‌ల ఈశ్వరన్‌’ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు.  దీపావ‌ళి కానుకగా శింబు ఇచ్చిన ఈ స‌ర్‌ప్రైజ్ యూనిట్ స‌భ్యులకి షాక్ ఇచ్చింది.