శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 12:43:02

శింబులో మార్పు చూసి షాక‌వుతున్న ఫ్యాన్స్

శింబులో మార్పు చూసి షాక‌వుతున్న ఫ్యాన్స్

త‌మిళ హీరో శింబు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితం. ఆయన నటించిన ‘మన్మథ’, ‘వల్లభ’ వంటి చిత్రాలు తెలుగువారిని మెప్పించాయి. త్వ‌ర‌లో ఈశ్వ‌రుడు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు.  నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో శింబు హీరోగా ఓ గ్రామీణ నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోహీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.  తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్న చిత్రం కన్నడ, మలయాళ, హిందీలోనూ విడుదల కానుంది.  

ఈశ్వ‌రన్ పోస్ట‌ర్‌లో శింబు చాలా స్లిమ్‌గా క‌నిపించాడు. ఆయ‌న లుక్ అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే శింబు దీనిని  ఓ ఛాలెంజ్‌గా తీసుకొని  101 కేజీల నుండి 71 కేజీల వ‌ర‌కు త‌గ్గాడ‌ట. త‌న‌లోని మార్పు త‌న‌కే షాకిచ్చింద‌ని అంటున్నాడు ఈ త‌మిళ హీరో. శింబు లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.