గురువారం 04 జూన్ 2020
Cinema - May 10, 2020 , 14:50:51

అభిమానికి క‌రోనా.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన హీరో

అభిమానికి క‌రోనా.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన  హీరో

క‌రోనా మ‌ర‌ణ మృదంగం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దేశాలు, రాష్ట్రాలు, ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు ఇలా ఎక్క‌డ చూసిన క‌రోనా గురించే చ‌ర్చ‌. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎలా పంజా విసురుతుందో అర్ధం కాని ప‌రిస్థితి. క‌రోనా వ‌ల‌న ఇప్ప‌టికే చాలా మంది మృత్యువాత ప‌డ‌గా, కొంద‌రు చికిత్స పొందుతున్నారు. తాజాగా త‌మిళ హీరో శింబు అభిమాని ఆనంద్‌కు క‌రోనా వైర‌స్ సోకింది.

త‌న అభిమానికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలుసుకున్న శింబు అత‌నికి ఫోన్ చేసి ధైర్యం అందించారు. ఎట్టిప‌రిస్థితుల‌లోను ధైర్యాన్ని కోల్పోవ‌ద్ద‌ని సూచించారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్ధిస్తాను అని చెప్పుకొచ్చారు. అభిమానుల వ‌ల‌నే నేను ఈ స్థాయికి వ‌చ్చాను . సినిమాలు లేని స‌మ‌యంలో అభిమానులు నా వెన్నంటే వున్నార‌ని, త‌న‌కు ధైర్యాన్నిచ్చార‌ని, ఆ ప్రేమే త‌న జీవితం ప్ర‌శాంతంగా మారేలా చేసింద‌ని, దాన్ని తాను ఎప్పుడూ మ‌ర్చిపోన‌ని వెల్ల‌డించారు శింబు ‌. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో  `మానాడు` పేరుతో  ఓ చిత్రం చేస్తున్నారు శింబు


logo