రికార్డు సృష్టిస్తున్న సిధ్ శ్రీరామ్ పాట..25 మిలియన్ల వ్యూస్

టాలీవుడ్ యాక్టర్ సాయిధరమ్ తేజ్, ఇస్మార్ట్ భామ నభానటేశ్ కాంబోలో వస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటరు. సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాటలు సంగీతప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. హే ఇది నేనే నా అంటూ..యువ సింగింగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడిన పాట మరోసారి రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ పాటకు యూట్యూబ్ లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన లిరికల్ వాల్యూస్ తో సాగే ఈ పాటను రఘురామ్ రాశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పలు చిత్రాల్లో సిధ్ శ్రీరామ్ పాడిన పాటలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..
- తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ఐఏఎస్‌లు
- నాగోబా జాతర రద్దు
- బైడెన్ ప్రమాణస్వీకారం రోజు శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్
- హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ
- నేటి నుంచి గొర్రెల పంపిణీ
- రాష్ట్రంలో చలి గాలులు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
- స్పుత్నిక్-వీ మూడో విడత ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి