ముంబై : టీవీ నటుడు సిద్ధార్ధ శుక్లా ముంబైలో అకస్మాత్తుకగా మరణించిన విషయం తెలిసిందే. నిన్న ఆ నటుడి అంత్యక్రియలు జరిగాయి. బాలికా వధులో తనతో కలిసి నటించిన షెహనాజ్ గిల్‌తో సిద్దార్ధ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కుటుంబాలు కూడా వారి పెళ్లికి అంగీకరించినట్లు ఓ కథనం ద్వారా వెల్లడైంది. శుక్లా, గిల్ ఎంగేజ్ అయ్యారని, ఈ ఏడాదిలో పెళ్లికి ప్లానేసినట్లు బాలీవుడ్ లైఫ్ ఓ కథనం రాసింది. ఆ పెళ్లి కోసం హోటల్ రూమ్ బుక్ చేసేందుకు, వెడ్డింగ్ కార్యక్రమాల గురించి రెండు ఫ్యామిలీలు ప్రిపరేషన్లో ఉన్నట్లు ఆ కథనంలో తెలిపారు. అయితే ఈ విషయాన్ని రెండు ఫ్యామిలీలు సీక్రెట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది.