మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 00:17:32

‘మహాసముద్రం’తో పునరాగమనం

‘మహాసముద్రం’తో పునరాగమనం

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ప్రేమకథా చిత్రాలతో లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు సిద్దార్థ్‌. విభిన్నమైన కథాంశాలతో హీరోగా ప్రతిభను చాటుకున్న సిద్దార్థ్‌ చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ‘మహాసముద్రం’ చిత్రంతో సుదీర్ఘవిరామం తర్వాత టాలీవుడ్‌లో పునరాగమనం చేయబోతున్నారాయన. ఈ సినిమాలో కీలకపాత్రను పోషించనున్నారు. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇంటెన్స్‌ లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అజయ్‌భూపతి రాసిన కథ శక్తివంతంగా ఉంటుంది. శర్వానంద్‌, సిద్దార్థ్‌ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ప్రతిభావంతులైన నటులు ఇద్దరినీ ఒకే తెరపై చూడటం ప్రేక్షకులకు కన్నుల పండువగా ఉంటుంది. మంచి  సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్న సిద్దార్థ్‌ అజయ్‌భూపతి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని అంగీకరించారు’ అని తెలిపారు. 

logo