మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 10:23:54

సంతకం ఫోర్జ‌రీ చేసి బెయిల్ తెచ్చుకున్న సినిమాటోగ్రాఫ‌ర్

సంతకం ఫోర్జ‌రీ చేసి బెయిల్ తెచ్చుకున్న సినిమాటోగ్రాఫ‌ర్

టాలీవుడ్ ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కె నాయుడు వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. సినీ ఆర్టిస్ట్ సాయి సుధా అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేసాడ‌ని ఆయ‌న‌పై ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఇందులో భాగంగా శ్యామ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి త‌ర‌లించారు. అయితే రెండు రోజుల్లోనే ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట‌కి వ‌చ్చాడు.

శ్యామ్ కే నాయుడు బెయిల్ విష‌యంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది.  ఇద్ద‌రు కాంప్ర‌మైజ్ అయిన‌ట్లు శ్యామ్ కే నాయుడు సంబంధిత ప‌త్రాల‌తో పిటిష‌న్ వేయ‌డంతో నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే శ్యామ్ బాధితురాలి సంతకం ఫోర్జ‌రీ  చేసి బెయిల్ పిటీష‌న్ పొందిన‌ట్టు తాజాగా వెల్ల‌డైంది. దీంతో బెయిల్ పిటీష‌న్‌ని స‌వాల్ చేస్తూ సాయి సుధ మ‌రోసారి కోర్టుని ఆశ్ర‌యించింది. దొంగ సంతకం పెట్టి బెయిల్ పొందాడ‌ని ఆమె కోర్టులో చెప్ప‌డంతో ఆయ‌నకి బెయిల్ ర‌ద్దు చేసి రిమాండ్‌కి త‌ర‌లించారు 


logo