‘ఓ ఇంటి నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. మైండ్‌గేమ్ ఆధారంగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది’ అని అన్నారు సుకు పూర్వజ్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘శుక్ర’. అరవింద్ కృష్ణ, శ్రీజితాఘోష్ జంటగా నటిస్తున్నారు. ఈ నెల 23న విడుదలకానుంది. సుకు పూర్వజ్ మాట్లాడుతూ ‘వ్యాపార పనుల నిమిత్తం వైజాగ్‌కు వచ్చిన ఓ కొత్త జంటకు ఎలాంటి భయానక పరిస్థితులు ఎదురయ్యాయి? మాఫియా గ్యాంగ్ సృష్టించిన నరమేధం నుంచి ఆ యువజంట బయటపడ్డారా? లేదా? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కథను నమ్మి లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమా చేశాం. సరికొత్త కథ, కథనాలతో అలరిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వచ్చేవారందరూ సంతృప్తిగా ఫీలవుతారు. పారితోషికం తీసుకోకుండా అరవింద్ కృష్ణ ఈ సినిమాలో నటించారు’ అని అన్నారు.