గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 12:59:53

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

ప‌లువురు కథ‌ల చుట్టూ తిరిగే క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్న అంథాల‌జీ నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ ఫిల్మ్ పిట్ట క‌థ‌లు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు త‌రుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంక‌ల్ప్‌రెడ్డి సంయుక్తంగా తీస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రొమాంటిక్‌, సస్పెన్స్ స‌న్నివేశాల‌తో సాగే టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. టీజ‌ర్ ను గ‌మ‌నిస్తే ఈషా రెబ్బా, ల‌క్ష్మీ మంచు, శృతిహాస‌న్‌, అమ‌లాపాల్ పాత్ర‌లు చాలా బోల్డ్ గా క‌నిపించ‌నున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

జ‌‌గ‌ప‌తిబాబు, అషిమా నర్వాల్‌, స‌త్య‌దేవ్‌, సాన్వే మేఘ‌నా, సంజిగత్ హెగ్డే ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్ఎస్వీపీ, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంట‌ర్టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్ర‌వ‌రి 19న ప్రీమియ‌ర్ కానుంది. 


మ‌హిళ‌లు, పురుషుల విష‌యంలో ప్రేమ, సాన్నిహిత్యం, ద్రోహం, హృదయ విదారక అంశాల చుట్టూ తిరిగే క‌థాంశంతో పిట్ట‌క‌థ‌లు ఆంథాలజీ కొన‌సాగనున్న‌ట్టు టీజ‌ర్ ను బ‌ట్టి తెలుస్తోంది. ఇలా న‌లుగురు ద‌ర్శ‌కులు క‌లిసి ప్రేక్ష‌కులకు విభిన్న క‌థాంశాల‌ను ఒకే స‌మాహారంగా చేసి చూపించ‌డం ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo