గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 00:11:16

‘అంధాదున్‌' రీమేక్‌లో?

‘అంధాదున్‌' రీమేక్‌లో?

ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి కథానాయిల్లో ఒకరిగా  భాసిల్లింది ఢిల్లీ సొగసరి శ్రియ. ఇటీవలకాలంలో సినిమాలు తగ్గించినా ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా శ్రియ తెలుగులో ఓ సినిమాకు అంగీకరించిందని సమాచారం. వివరాల్లోకి వెళితే..హిందీలో విజయవంతమైన ‘అంధాదున్‌' చిత్రాన్ని తెలుగులో నితిన్‌ కథానాయకుడిగా రీమేక్‌ చేయబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. స్వీయ నిర్మాణంలో నితిన్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.  ‘అంధాదున్‌' చిత్రంలో టబు పోషించిన పాత్రను తెలుగులో శ్రియ చేయనుందని తెలిసింది. మాతృకలో నటించిన టబునే తెలుగు రీమేక్‌లో తీసుకోవాలని భావించినా అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించలేనని చెప్పిందట. దాంతో చిత్రబృందం శ్రియను సంప్రదించగా ఆమె అంగీకరించిందని సమాచారం. ఈ సినిమాలో శ్రియ పాత్ర నెగెటివ్‌ ఛాయలతో సాగనుంది.