గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 22, 2020 , 07:19:09

క‌రోనా ఎఫెక్ట్‌.. శ్రియ బిజినెస్ బోల్తా

క‌రోనా ఎఫెక్ట్‌.. శ్రియ బిజినెస్ బోల్తా

క‌రోనా కార‌ణంగా అన్ని రంగాల‌కి చెందిన ప‌రిశ్ర‌మ‌లు మూతప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో బిజినెస్ రేటు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది. చేసేదేం లేక త‌ల‌లు పట్టుకు కూర్చుంటున్నారు వ్యాపార‌వేత్త‌లు. అయితే ఈ ప‌రిస్థితి శ్రియ కూడా ఎదుర్కొంటుంద‌ట‌. కొద్ది నెల‌ల క్రితం వివాహం చేసుకున్న శ్రియ రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ ని వివాహం చేసుకుంది. స్పెయిన్ లోని ప్రధాన నగరమైన బార్సిలోనాలో ఈ అమ్మడు తన భర్తతో కలిసి రెండు రెస్టారెంట్లు నిర్వహిస్తుంది. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఎవ‌రు రెస్టారెంట్‌కి రాక‌పోవ‌డంతో ఈగ‌లు తోలుకోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తోటి సన్నిహితుల‌తో చెబుతుంద‌ట‌.

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న శ్రియ టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల మెప్పు పొందింది. సైలైంట్‌గా ఓ రోజు త‌న పెళ్లి విష‌యాన్ని చెప్పిన శ్రియ ఇటీవ‌ల డెహ్రాడూన్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం సినిమాలు లేక ఈ అమ్మ‌డు ఖాళీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది .


logo