బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 16, 2020 , 20:57:37

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన బాలీవుడ్‌ భామ

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన బాలీవుడ్‌ భామ

ముంబై : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. సినీ నటులు, వివిధశాఖ అధికారులు, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటూ మొక్కలు నాటుతూ తమవంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ, సాహో ఫేమ్‌ శ్రద్ధా కపూర్‌ సైతం కార్యక్రమంలో పాల్గొంది. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది. బుధవారం ముంబైలోని తన నివాసంలో మొక్కను నాటింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపింది. కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళుతున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమానికి తనను నామినేట్‌ చేసిన ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపింది.


logo