మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 23:56:18

హీరోలను ప్రశ్నించరెందుకు?

హీరోలను ప్రశ్నించరెందుకు?

‘పెళ్లి తర్వాత కథానాయికల డిమాండ్‌ తగ్గుతుందా? అని ప్రశ్నిస్తోంది శ్రద్ధాశ్రీనాథ్‌.అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలతో దక్షిణాది చిత్రసీమలో రాణిస్తోన్న ఆమె ‘అగ్ర కథానాయికలు కాకుండా ప్రధాన పాత్రలు పోషించే తారలకు పెళ్లి తర్వాత అవకాశాలు కనుమరుగవుతాయా?’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానుల్ని అడిగింది.  దీనిపై అందరి అభిప్రాయాల్ని తెలుసుకోవాలనుందంటూ చెప్పింది. 

ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారికి పది మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ‘పళ్లైన హీరోలు కథానాయికలతో తెరపై రొమాన్స్‌ చేస్తుంటారు. పెళ్లి తర్వాత  కథానాయికలు అలాంటి పాత్రలు  చేస్తే విమర్శిస్తుంటారు. హీరోలకు లేని పరిమితులు కథానాయికలకు ఎందుకు?’అంటూ పేర్కొంది. ‘నా స్నేహితురాలైన ఓ నటి త్వరలో పెళ్లిచేసుకోనున్నది. తన గురించి సినీ పరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుందా? అంటూ వ్యగ్యంగా నన్ను అడిగాడు. అతడి ప్రశ్న నాలో ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలాంటి ప్రశ్నల్ని హీరోలను ఎందుకు అడగరు’ అంటూ పేర్కొన్నది. శ్రద్ధాశ్రీనాథ్‌ ప్రశ్నలకు అభిమానులు భిన్న రకాలుగా సమాధానమిచ్చారు.logo