శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 14:27:57

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ చిన్న‌నాటి స్నేహితురాలు న‌టాషా ద‌లాల్‌ను పెండ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వ‌రుణ్‌-న‌టాషా వెడ్డింగ్ ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఓ ఇంటివాడైన వ‌రుణ్‌కు జెర్సీ ఫేం శ్ర‌ద్దా శ్రీనాథ్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. విషెస్‌తోపాటు ఓ సెటైరిక‌ల్ పోస్ట్ కూడా పెట్టింది. శ్ర‌ద్దా శ్రీనాథ్ పెట్టిన పోస్ట్ తో  చాలా మంది సినీ ల‌వ‌ర్స్ లో సందేహాలు వ్య‌క్తంమ‌వుతున్నాయి. 

'మ‌రో మంచి న‌టుడు దూరం కాబోతున్నాడు. వ‌రుణ్‌ను మ‌నం మళ్లీ స్క్రీన్ పై చూడ‌లేము. పెండ్లి త‌ర్వాత వ‌రుణ్ ఇత‌ర హీరోయిన్లతో క‌లిసి న‌టించేందుకు.. అత‌ని భార్య‌, వారి బంధువులు ఒప్పుకోరు. వ‌రుణ్ మేల్ ఓరియెంటెడ్ సినిమాల‌కు స్వ‌స్తి చెప్ప‌వ‌చ్చేమో..? వ‌్యక్తిగ‌త జీవితాన్ని, వృత్తిప‌ర జీవితాన్ని వ‌రుణ్ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తాడో. చాలా క‌ష్ట‌మైన ప‌ని. అత‌న్ని మిస్ మిస్స‌వుతున్నాం. వ‌రుణ్ కు శుభాకాంక్ష‌లు' అని ఇన్ స్టాగ్రామ్ లో సెటైరిక‌ల్ పోస్ట్ పెట్టింది.

శ్ర‌ద్దా శ్రీనాథ్  మ‌రి వ‌రుణ్ ధావ‌న్ ను ఆట‌ప‌ట్టించేందుకు ఇలా పోస్ట్ పెట్టిందా..? లేదా నిజంగానే వ‌రుణ్ సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించ‌డా..? అనేది తెలియాలంటే మ‌రికొంత కాలం వెయిట్‌చేయాల్సిందే. 2020లో మాధ‌వ‌న్ తో క‌లిసి మారా చిత్రంలో మెరిసింది శ్ర‌ద్దా శ్రీనాథ్ . ఓటీటీ లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న చిత్రంలో న‌టిస్తోంది. దీంతోపాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ప‌లు ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టింది. 

ఇవి కూడా చ‌ద‌వండి..

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo