బాలీవుడ్ బ్యూటీ శ్రధ్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఈ అమ్మడు తన సినిమా విషయాలతో పాటు దైనందిన కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఈ అమ్మడు తన తండ్రి.. నటుడు శక్తి కపూర్ .. తల్లి శివంగి పురే తనతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ స్కూబా డైవ్ చేసి అందకు సంబంధించిన వీడియో షేర్ చేసింది.
నీటి అడుగున తీసిన వీడియో క్లిప్ లో అనేక జలరాశులు కనిపిస్తున్నాయి. అలానే కొన్ని డాల్ఫిన్ లు శ్రద్ధాతో ఆడుకుంటున్నట్టుగా ఉంది. ఈ వీడియో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు రోహన్ శ్రేష్ఠ అనే వ్యక్తితో త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తుంది. చివరిగా స్ట్రీట్ డాన్సర్ 3డి .. బాఘి 3 చిత్రాలతో అలరించిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు రణ్బీర్తో కలిసి ఓ చిత్రం చేస్తుంది.