e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home సినిమా ఆటోలో ఓ సాయంకాలం

ఆటోలో ఓ సాయంకాలం

విలాసాలకు కాస్త విరామమిచ్చి సాధారణ జీవితం తాలూకు మహత్తు ఏమిటో తెలుసుకోవాలని చెబుతున్నది బాలీవుడ్‌ అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్‌. కుర్రకారు కలలరాణిగా భాసిల్లుతున్న ఈ సొగసరి ఒక్కోసారి అనూహ్యమైన చర్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ అందమైన సాయంకాలాన ముంబయి వీధుల్లో ఆటోలో విహరిస్తూ చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ‘నిర్విరామమైన విలాససౌఖ్యం కూడా అంత మంచిదికాదు. అప్పుడప్పుడు సాధారణత్వంలోకి ప్రయాణించాలి. సమూహంలో ఒక్కరిగా కలిసిపోవాలి. అతి సాధారణంగా అనిపించే జీవనస్రవంతిలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి’ అంటూ తన ఆటో ప్రయాణం తాలూకు అనుభూతుల్ని కవిత్వీకరించిందీ సుందరి. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆటో జర్నీ వీడియోను పోస్ట్‌ చేసింది. దీనికి ‘బ్యూటీఫుల్‌ సిటీ..’ అనే ఇంగ్లీష్‌ గీతాన్ని జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ‘మీ సింప్లిసిటీకి జోహార్లు’ అంటూ ఫ్యాన్స్‌ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌ నాయికలు కొంతమంది ఇలా ఆటవిడుపు కోసం తమ లగ్జరీ కార్లను పక్కనబెట్టి రహస్యంగా ఆటోల్లో విహరిస్తూ ఆ అనుభవాల్ని సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement