శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 14:45:03

ఎకో ఫ్రెండ్లీ వినాయ‌కుల‌ని వాడాలంటున్న శ్ర‌ద్ధా క‌పూర్

ఎకో ఫ్రెండ్లీ వినాయ‌కుల‌ని వాడాలంటున్న శ్ర‌ద్ధా క‌పూర్

పండుగ‌లు ప‌ర్యావ‌ర‌ణాకి హితం క‌లిగించేవిగా ఉండాలే త‌ప్ప హాని క‌లిగించ‌కూడ‌దు. వినాయ‌క చ‌వితి రోజు ఉప‌యోగించే రంగు రంగుల వినాయ‌క ప్ర‌తిమ‌లు, దీపావ‌ళి రోజు వెలిగించే క్రాక‌ర్స్ వ‌ల‌న వాతావ‌ర‌ణం చాలా దెబ్బ‌తింది. పర్యావ‌ర‌ణం కాలుష్య‌పు కోర‌ల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే ఎకో ఫ్రెండ్లీ వైపే ఎక్కువ మొగ్గు చూపాలి. దీని వ‌ల‌న అంద‌రికి మంచి జ‌రుగుతుంద‌ని సినీ సెల‌బ్రిటీలు జ‌నాల‌లో చైత‌న్యం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

ప్ర‌కృతిని ప‌రిర‌క్షించ‌డం, వన్య‌ప్రాణుల హ‌క్కుల‌ని సంర‌క్షించే పోరాటంలో ఎప్పుడు ముందుంటుంది బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్. మ‌రి కొద్ది రోజుల‌లో వినాయ‌క చ‌వితి రానున్న నేప‌థ్యంలో జ‌నాల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేలా పోస్ట్ ఫెట్టింది శ్ర‌ద్దా. ఎకో ఫ్రెండ్లీ గ‌ణేష్ వాడ‌డం వ‌ల‌న నీరు క‌లుషితం కావు. గ‌ణేష్ వేడుక‌లు  అంత‌టా  ఘ‌నంగా జ‌రుగుతాయి. ఈ పండుగ‌ని జ‌రుపుకునే ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ గ‌ణేష్‌ని మాత్ర‌మే పెట్టుకోండి అంటూ ప‌లు సూచ‌న‌లు చేస్తుంది.


logo