గురువారం 26 నవంబర్ 2020
Cinema - Jun 22, 2020 , 16:55:19

భయంగా..నవ్వుతూ కనిపించిన శ్రద్దాకపూర్‌..వీడియో

భయంగా..నవ్వుతూ కనిపించిన శ్రద్దాకపూర్‌..వీడియో

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది బాలీవుడ్‌ నటి శ్రద్ధ్దాకపూర్‌. ఈ భామకు సంబంధించిన త్రోబ్యాక్‌ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ అయింది. 2018లో వచ్చిన బట్టీ గుల్‌ మీటర్‌ చలూ షూటింగ్‌ సమయంలో..శ్రద్దాకపూర్‌ కర్లీ హెయిర్‌, థిక్‌ బ్లూ కాస్ట్యూమ్స్‌లో అద్దంవైపు చూస్తూ నిలబడి వీడియో తీసింది. మొదట కర్లీ హెయిర్‌తో కాస్త భయంతో చూసిన శ్రద్దా..ఆ తర్వాత నవ్వుతూ కనిపిస్తున్న వీడియోను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. శ్రధ్దాకపూర్‌, వరుణ్‌ధావన్‌, ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడి లో శ్రద్దాకపూర్‌ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించింది. 

2020లో శ్రద్ధాకపూర్‌ నటించిన బాఘీ-3 ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడి సినిమాకు మంచి టాక్‌ వచ్చింది.