సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 00:51:36

డ్రగ్స్‌ కేసులో శ్రద్ధా, సారా?

డ్రగ్స్‌ కేసులో శ్రద్ధా, సారా?

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. ఈ కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగుచూడటంతో సుశాంత్‌సింగ్‌ ప్రియురాలు రియాచక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఆరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఎన్‌సీబీ విచారణ సందర్భంగా రియాచక్రవర్తి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం కథానాయికలు శ్రద్ధాకపూర్‌, సారాఅలీఖాన్‌కు త్వరలో ఎన్‌సీబీ సమన్లు జారీ చేయొచ్చని తెలిసింది. రియాచక్రవర్తి ఫోన్‌లోని వాట్సాప్‌ సందేశాల్ని తొలగించగా..ఎన్‌సీబీ అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి వాటిని సేకరించారు. ఈ సందేశాల ఆధారంగా చేపట్టిన ప్రాథమిక విచారణలో  శ్రద్ధాకపూర్‌, సారాఅలీఖాన్‌కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఎన్‌సీబీ నిర్ధారించినట్లు సమాచారం. విచారణ నిమిత్తం ఈ వారంలోనే వీరిద్దరికి ఎన్‌సీబీ సమన్లు జారీ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.logo