శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 19, 2020 , 01:45:54

మాస్క్‌లతో షూటింగ్‌

మాస్క్‌లతో షూటింగ్‌

కరోనా వైరస్‌ కారణంగా తారలంతా తమ షూటింగ్‌లకు బ్రేక్‌ తీసుకున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రం ముందస్తు జాగ్రత్తలతో షూటింగ్‌లో పాల్గొన్నది.మాస్క్‌ ధరించి శానిటైజర్స్‌ బాటిల్స్‌ను చూపిస్తూ తన టీమ్‌తో కలిసి షూటింగ్‌ లొకేషన్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసింది. ‘ఈ రోజు షూటింగ్‌ను రద్దు చేయలేకపో యాం. యూనిట్‌ మొత్తం జాగ్రత్తలు పాటిస్తున్నాం. సానుకూలంగా ఆలోచిస్తూ చిరునవ్వుతో కరోనాను జయించండి’ అంటూ వ్యాఖ్యానించింది  రకుల్‌ప్రీత్‌సింగ్‌. షూ టింగ్‌ అనంతరం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇంట్లోనే యోగా చేస్తూ కనిపించింది.


logo