బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 00:24:53

ఓదెలలో ‘ఓదెల రైల్వే స్టేషన్‌' షూటింగ్‌

ఓదెలలో ‘ఓదెల రైల్వే స్టేషన్‌' షూటింగ్‌

పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ప్రముఖ సినిమా దర్శకుడు సంపత్‌నంది కథతో నిర్మాత కేకే రాధామోహన్‌ తెరకెక్కిస్తున్న డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌'. ఈ  సినిమా షూటింగ్‌ మంగళవారం ఓదెలలో ప్రారంభమైంది.  ఓదెల మండల పరిషత్‌ కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ప్రధాన ఘట్టాలను చిత్రీకరించారు. కన్నడ హీరో వశిష్ఠ ఎన్‌ సింహా, హీరోయిన్‌ హెభాపటేల్‌తో పాటు పలువురు నటీనటులపై ఈ సన్నివేశాల్ని తెరకెక్కించారు.  ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా హీరోయిన్‌ హెభా పటేల్‌ నటిస్తోంది. షూటింగ్‌ విషయం తెలియగానే ప్రజలు భారీగా తరలిరాగా, పోలీసు బందోబస్తు మధ్య సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌ సౌందర్‌ రాజన్‌ పలు సన్నివేశాలు చిత్రీకరించారు.గత 30 రోజులుగా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలలో షూటింగ్‌ చేశారు.ఈ చిత్రానికి సంపత్‌ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు. logo