బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్‌కు దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులని పలకరించింది ఈ ముద్దుగుమ్మ. మంచు మనోజ్ కరెంట్ తీగ
చిత్రంలో స్పెషల్ పాత్ర స్పెషల్ నంబర్ తో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ భామ తర్వాత ఐటెం సాంగ్స్ చేసింది. కన్నడ చిత్రం కోటిగోబ్బా 3 లో డాన్స్ నంబర్ చేసిన ఈ ముద్దగుమ్మ ఇప్పుడు వై.రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న కాటన్ పేట్ గేట్
అనే కన్నడ చిత్రంలో నర్తిస్తుంది. ఇందులో సన్నీ తన ఆట పాటతో అలరించనుంది.
అయితే కాటన్ పేట గేట్ అనే సినిమాని తెలుగులో సీతన్నపేట్ గేట్
గా కూడా తీస్తున్నారు. ఈ పాట షూటింగ్ ఈ నెలాఖరులోగా హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. మార్చిలో చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ కరోనావైరస్ రెండవ వేవ్ అన్ని ప్రణాళికలను నాశనం చేసింది. ఎట్టకేలకు పాట రూపొందుతుంది. ఇక రానున్న రోజులలో సన్నీ తన పాటతో తెలుగు ప్రేక్షకులని సైతం అలరించనుంది. ఈ చిత్రంలో యశ్వాన్- వేణు- కిస్లే చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. జిస్మ్ 2తో మొదలైన సన్నీలియోన్ కెరీర్ ఇటీవల మళ్లీ యష్ రాజ్ సంస్థ ఆఫర్లతో రీబూట్ అవుతోంది.