ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 18:00:42

షాకింగ్ ఫొటో..వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో..?

షాకింగ్ ఫొటో..వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో..?

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా పిలుచుకునే వర్మ పవర్ స్టార్ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను  విడుదల చేస్తూ..ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. గతంలో పలు సినిమాలకు సంబంధించి వర్మ కొన్ని ఫొటోలు విడుదల చేసినప్పటికీ..సెన్సార్ సమస్యలతో అవి తెరపై మాత్రం కనిపించలేదు. కానీ ఇపుడు థియేటర్లలో విడుదల లేకుండా..డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలవుతుండంతో వర్మకు స్వేచ్చ దొరికినట్లైంది. 

పవర్ స్టార్ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు లవ్ లీ బ్రదర్స్ క్యాప్షన్ తో వర్మ రిలీజ్ చేసిన మరో పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాగా సోఫాలో కూర్చుని మేథోమథనం జరుపుతున్నట్టుగా ఉన్న స్టిల్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ ఏదో సమస్యలో ఉన్నట్టుగా కనిపిస్తుండటం..చిరంజీవి అతనికి నచ్చజెప్పుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల ఫలితాల  తర్వాత కథ అంటూ వర్మ ఈ సినిమాతో ప్రేక్షకులకు ఏం చెప్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo