మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 15:27:20

చ‌నిపోయే ముందు సుశాంత్ త‌న ఫోన్‌లో ఏం చెక్ చేశాడంటే..!

చ‌నిపోయే ముందు సుశాంత్ త‌న ఫోన్‌లో ఏం చెక్ చేశాడంటే..!

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌కి సంబంధించిన అనేక‌ చీక‌టి కోణాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఎప్ప‌టి నుండో ఉన్న బంధుప్రీతి వ‌ల‌న అనేక‌మంది ఇబ్బందులు ప‌డ్డ‌ప్ప‌టికీ, సుశాంత్ మ‌ర‌ణం తర్వాత దీనిపై హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. నెపోటిజంని స‌పోర్ట్ చేసే వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే క్ర‌మంలో సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కి సంబంధించి అనేక కోణాల‌లో విచారిస్తున్నారు బాంద్రా పోలీసులు.

విచార‌ణ‌లో భాగంగా సుశాంత్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ నిపుణులు డేటాని వెల్ల‌డించారు. చ‌నిపోయే కొద్ది నిమిషాల ముందు సుశాంత్ గూగుల్‌లో త‌న పేరుతో సెర్చ్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. త‌న పేరుని చాలా సార్లు  సెర్చ్ చేశాడ‌ని, వెబ్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ని విశ్లేషించుకున్నాడ‌ని అంటున్నారు. వెబ్ మీడియాలో త‌న ప్రేమ‌, ఇత‌ర విష‌యాల‌పై ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌ర‌గ‌డం వ‌ల‌న సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడేమోన‌ని పోలీసులు ప్రాధ‌మిక నిర్థార‌ణ‌కి వ‌స్తున్నారు. జూన్ 14న సుశాంత్ త‌న ఇంట్లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo