గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 15:13:46

ముంబై ఎయిర్ పోర్టుకు కంగ‌నా..శివ‌సేన ఆందోళ‌న‌

ముంబై ఎయిర్ పోర్టుకు కంగ‌నా..శివ‌సేన ఆందోళ‌న‌

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కార్యాల‌యం కూల్చివేత ప‌నుల‌పై ముంబై హైకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కంగ‌నా ర‌నౌత్ ముంబైకి చేరుకున్నారు. అయితే కంగ‌నా వ‌స్తున్న‌ట్టు స‌మాచార‌మందుకున్న శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఛ‌త్ర‌ప‌తి శివాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు వ‌ద్ద‌కు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ కంగ‌నా గో బ్యాక్ అంటూ ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నేరుగా ర‌న్ వే నుంచి కంగ‌నాను సుర‌క్షితంగా త‌ర‌లించారు.  

ముంబైపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కంగ‌నా న‌గ‌రంలో అడుగుపెట్టొద్ద‌ని శివ‌సేన కార్య‌క‌ర్త‌లు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం కంగ‌నాకు వై కేట‌గిరి భ‌ద్ర‌తను క‌ల్పించింది. కంగ‌నా శివ‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు స‌వాలు విసిరి మ‌రి చండీగ‌ఢ్ నుంచి ముంబైకు చేరుకున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo