డా.శివరాజ్‌కుమార్ హీరోగా కన్నడ,తెలుగు భాషల్లో నిర్మాణం జరుపుకొంటున్న చిత్రం ‘జై భజరంగి’. 2013లో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘భజరంగి’ చిత్రానికి కొనసాగింపు ఇది. హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ పన్సారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశలో వున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్రబృందం తెలిపింది. భావనమీనన్, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య