శుక్రవారం 03 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 10:25:26

శివాని డెబ్యూ చిత్రం..ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

శివాని డెబ్యూ చిత్రం..ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

రాజ‌శేఖ‌ర్ ముద్దుల త‌న‌యు శివాని  వెండితెర ఆరంగేట్రం ఎట్ట‌కేల‌కి క‌న్‌ఫాం అయింది. ఈ రోజు శివాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న తొలి చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. వెన్నెల పాత్ర‌లో శివానీ న‌టిస్తుండగా, ఆమె లుక్ అభిమానుల‌కి అమితానందాన్ని క‌లిగిస్తుంది. అనేక సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన‌ తేజ స‌జ్జా చిత్రంలో  ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ రూపొంద‌నుంది

శివాని టూ స్టేట్స్‌ తెలుగు రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అడవిశేష్‌, శివానీ కాంబోలో ఫైనల్‌ చేసిన ఈ ప్రాజెక్టు 2018లో లాంఛనంగా ప్రారంభమైంది. 2019లో సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉండ‌గా, మ‌ధ్య‌లోనే ర‌ద్దు చేశారు. ఇక శివానీ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాని తెర‌కెక్కిస్తున్న మ‌ల్లిక్ రామ్‌.. సుమంత్‌తో కలిసి నరుడా డోనరుడా సినిమా తీశాడు. పెళ్లి గోల అనే పాపుల‌ర్ వెబ్ సిరీస్ కూడా రూపొందించారు.


logo