గురువారం 02 ఏప్రిల్ 2020
Cinema - Feb 16, 2020 , 23:07:03

శివలింగాపురం రహస్యం

శివలింగాపురం రహస్యం

ఆర్‌.కె. సురేష్‌, మధుబాల జంటగా నటిస్తున్న చిత్రం ‘శివలింగాపురం’.  తోట కృష్ణ దర్శకుడు.  రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్నారు. సెన్సార్‌ పూర్తయింది. ఈ నెల 21న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘భక్తిప్రధానంగా రూపొందిన చిత్రమిది. శివలింగాపురం అనే గ్రామంలో  మహిమగల పురాతన శివలింగం దొంగిలించబడుతుంది. విద్రోహుల చెర నుంచి ఆ లింగాన్ని ఓ వ్యక్తి ఎలా రక్షించాడనే కథాంశంతో రూపొందించాం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో సినిమాను విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు. డి.ఎస్‌.రావు, బేబీ హర్షిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్‌, మాటలు:చరణ్‌.logo
>>>>>>