గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Jul 29, 2020 , 16:29:38

శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా సినిమా షురూ

శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా సినిమా షురూ

శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా న‌టిస్తోన్న చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. జయ దుర్గాదేవి మల్టీమీడియా పతాకంపై విజ‌య్ రాజా, తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ఇవాళ‌ హైదరాబాద్ లోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమానికి హీరో నాగ శౌర్య ముఖ్య అతిథిగా హాజ‌రై..ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సంద‌ర్భంగా హీరో విజయ్ రాజా  ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..మా చిత్రం ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన  హీరో నాగ శౌర్య అన్నకి చాలా ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడు నిర్మాతకి ధన్యవాదాలు. కథ చాలా బాగుంది" అని తెలిపారు. 

దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ..నాకు అవకాశం ఇచ్చిన జయదుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్  నిర్మాత తూము నరసింహ పటేల్ కు నా ధన్యవాదాలు. నాకు మంచి నిర్మాత దొరికాడు, ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఓపెనింగ్ కు వచ్చిన హీరో నాగశౌర్యకు నా ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజా ఈ చిత్రానికి ఫ‌ర్ ఫెక్ట్. ఇది పూర్తి వినోదాత్మ‌క చిత్రం. శివాజీ రాజా  కథ విన్నారు, ఆయనికి కథ బాగా నచ్చింది. మా హీరో మాస్ కి క్లాస్ కి రెండింటికి సూట్ అవుతారు. అయన ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది. హీరోయిన్ తమన్నా వ్యాస్ ఒరిస్సా లో టాప్ హీరోయిన్.. మంచి నటి, నిర్మాత. త‌మ‌న్నా వ్యాస్ తమ్ముడు ఇందులో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు" అని తెలిపారు.


శివాజీ రాజా మాట్లాడుతూ..ఈ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలైంది. కథ బాగుంది. నాగ శౌర్యకు  కృతజ్ఞతలు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలని కోరుకున్నారు.  హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ "ఇది నా మొదటి తెలుగు సినిమా. నాకు అవకాశం ఇచ్చిన  దర్శకుడు, నిర్మాతకి ధన్యవాదాలు" అని తెలిపారు. నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ.. జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యాన‌ర్ లో ఇది మా మొదటి సినిమా. మా కార్యక్రమానికి వచ్చినందుకు హీరో  నాగ శౌర్యకు ధన్యవాదాలు. మంచి కథతో వస్తున్నాం, చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాం. శివాజీ రాజా అబ్బాయి విజయ్ రాజాతో సినిమా చేయటం చాలా సంతోషం గా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి" అని అన్నారు.

నటి నటులు :

విజయ్ రాజు, శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, చమ్మక్ చంద్ర, మిర్చి హేమంత్, రోహిణి, జబర్దస్త్  అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, గడ్డి సుబ్బా రావు, రాజేంద్ర కుమార్, కోట యశ్వంత్ తదితరులు

బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా

కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి 

కెమెరా : కె బుజ్జి 

సంగీతం : గ్యాని సింగ్ 

ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్ 

కో డైరెక్టర్ : ప్రకాష్ 

ఎడిటర్ :వినోద్ 

పి ఆర్ ఓ : హర్ష 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ 

నిర్మాత : తూము నరసింహ పటేల్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్



logo