రజినీకాంత్ సినిమాలు అంటే తెలుగు, తమిళం అని భాషతో సంబంధం ఉండదు. ఆయన యూనివర్సల్ హీరో. అన్నిచోట్లా రజినీ సినిమాకు రప్ఫాడిస్తుంటాయి. అలాంటి ఇమేజ్ సంపాదించుకున్నారు. అలాంటి సూపర్ స్టార్ తో శంకర్ తొలిసారి కాంబినేషన్ లో చేసిన సినిమా శివాజీ. జూన్ 15, 2007లో విడుదలైంది ఈ చిత్రం. అంటే నేటికి సరిగ్గా 14 ఏళ్లు అయింది. అప్పట్లో శివాజీ సినిమా ఓ సంచలనం. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అదిరిపోయే వసూళ్ళను అందుకుంది. తెలుగులో భారీ సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. 14 ఏళ్ళ కింద వచ్చిన శివాజీ వసూలు చేసిన లెక్కలు ఎలా ఉన్నాయంటే..
నైజాం- 4.25 కోట్లు
సీడెడ్- 3.42 కోట్లు
ఉత్తరాంధ్ర- 2.65 కోట్లు
ఈస్ట్- 1.55 కోట్లు
వెస్ట్- 1.52 కోట్లు
గుంటూరు- 1.90 కోట్లు
కృష్ణా- 1.60 కోట్లు
నెల్లూరు- 0.84 కోట్లుఏపీ + తెలంగాణ: 17.73 కోట్లు
రజినీకాంత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే అప్పట్లో డబ్బింగ్ సినిమా అయినా కూడా‘శివాజి’ చిత్రానికి తెలుగులో 15.32 కోట్ల రికార్డ్ బిజినెస్ జరిగింది. అప్పటి వరకు డబ్బింగ్ సినిమాలలో అదే హైయ్యస్ట్. అయినా కూడా ఫుల్ రన్ లో శివాజీ అందరి అంచనాలు అందుకుంటూ 17.73 కోట్ల షేర్ వసూలు చేసింది. అప్పట్లో ఓ డబ్బింగ్ సినిమా ఇంత వసూలు చేయడం కూడా రికార్డే. బయ్యర్లకు దాదాపు 3 కోట్ల లాభాలు అందించింది శివాజీ. ఇందులో సుమన్ విలనిజం హైలైట్. మరోవైపు శ్రీయ అందాల విందు కూడా బాగానే వర్కవుట్ అయింది.