సోమవారం 25 మే 2020
Cinema - Feb 21, 2020 , 11:29:45

శివ‌రాత్రి కానుక‌గా 'క్రాక్' టీజ‌ర్

శివ‌రాత్రి కానుక‌గా 'క్రాక్' టీజ‌ర్

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇటీవ‌ల డిస్కోరాజా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తాను గోపిచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు.  నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న‌ క్రాక్ సినిమాని 2020, మే 8న విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.   థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన బలుపు మంచి విజయం సాధించింది. చిత్రంలో  వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  శివ‌రాత్రి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ సాయంత్రం 6.03ని.ల‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. టీజ‌ర్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


logo