శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Jan 28, 2020 , 23:57:27

చిరంజీవి నాకు స్ఫూర్తి

చిరంజీవి నాకు స్ఫూర్తి

 ‘నటుడిగా చిరంజీవి నాకు స్ఫూర్తి.  సినిమాల పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి’ అని అన్నారు శివ కందుకూరి. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. రాజ్‌ కందుకూరి నిర్మించారు. శేషసింధురావు దర్శకురాలు. ఈ నెల 31న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో శివ కందుకూరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సహజత్వంతో కూడిన ప్రేమకథ ఇది. నిజజీవితంలో  కనిపించే పాత్రలు, సన్నివేశాలతో ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుంది. 16 ఏళ్ల నుంచి 25 వయసు మధ్య సిద్ధు అనే యువకుడి జీవితగమనంలో ఎదురైన పరిణామాలతో హృద్యంగా సాగుతుంది. కథా నేపథ్యం, పాత్ర చిత్రణలు వైవిధ్యంగా ఉంటాయి.  ఇంజినీరింగ్‌ పూర్తిచేసివెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడాలనే తన కలను నేరవేర్చుకునే యువకుడిగా నేను కనిపిస్తాను.సంగీత దర్శకురాలు అవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న యువతిగా హీరోయిన్‌ పాత్ర సాగుతుంది. నన్ను పరిచయం చేయాలనే ఆలోచనతో కాకుండా కథ నచ్చి నాన్న ఈ సినిమాను నిర్మించారు.


నాన్న ఈ సినిమా చూసి మొదటి చిత్రమే అయినా పరిణితితో నటించావని మెచ్చుకున్నారు.నటుడవ్వాలనే ఆలోచన ఉందని తొలుత నాన్నతో చెప్పగానే తక్కువ సక్సెస్‌ రేటు ఉన్న రంగమిది, నటన పట్ల తపన, ఇష్టం  ఉంటేనే రాణించగలవని  సలహా ఇచ్చారు. పరాజయాల్ని చూసి భయపడకూడదని పోరాటయోధుడి స్ఫూర్తిని కలిగి ఉండాలని చెప్పారు. కొత్తదనం, నిజాయితీతో కూడిన కథల్ని ఎంచుకోగలిగితే విజయాల్ని అందుకోగలవని సూచించారు. సృజనారావు అనే దర్శకురాలితో తదుపరి సినిమా చేయబోతున్నాను.  ఇందులో క్రీడాకారుడిగా కనిపిస్తాను. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలంటే చాలా ఇష్టం’ అని తెలిపింది. 


logo