శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 12:45:17

స్టార్ డైరెక్టర్ శివ ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

స్టార్ డైరెక్టర్ శివ ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు శివ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి జయకుమార్ కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న జయ కుమార్ నవంబర్ 27న చెన్నైలో మృతి చెందారు. ఈయన మృతితో శివ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2008లో గోపీచంద్ హీరోగా వచ్చిన శౌర్యం సినిమాతో ఈయన దర్శకుడిగా మారాడు. అంతకుముందు శివ సినిమాటోగ్రఫర్. శౌర్యంతో హిట్ కొట్టి ఆ వెంటనే శంఖంతో యావరేజ్ అందుకున్నాడు. ఆ తర్వాత రవితేజ హీరోగా దరువు సినిమా చేసాడు. కానీ అది అంచనాలు అందుకోలేదు. కానీ తమిళనాట విక్రమార్కుడు రీమేక్ సిరుత్తై సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అక్కడ సిరుత్తై శివ అయిపోయాడు. సిరుత్తై తర్వాత అజిత్ తో వీరమ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. 

ఆ తర్వాత ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయాడు. వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు చేసాడు. అందులో విశ్వాసం మినహా మిగిలిన మూడు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం రజినీకాంత్ తో అన్నాత్తై సినిమా చేస్తున్నాడు శివ. ఈ తరుణంలో ఆయన తండ్రి మరణించడం ఆయన్ని విషాదంలోకి నెట్టింది. జయకుమార్ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈయన షార్ట్ ఫిల్మ్ మేకర్ గా చాలా మంచి పేరుంది. 400 సినిమాలకు పైగా పని చేసాడు జయకుమార్. ఈయన మరణం తమిళ సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. జయకుమార్ అంత్యక్రియలు నవంబర్ 28న చెన్నైలోనే జరగబోతున్నాయి. ఈయన మృతికి తమిళ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. శివను అందరూ ఫోన్ లో పరామర్శిస్తున్నారు.


logo