గురువారం 28 మే 2020
Cinema - May 15, 2020 , 11:43:52

భ‌ర్త‌ని చిత‌క్కొట్టిన శిల్పా శెట్టి..!

భ‌ర్త‌ని చిత‌క్కొట్టిన శిల్పా శెట్టి..!

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో సెల‌బ్రిటీలంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభిమానుల‌కి కావ‌ల‌సినంత వినోదం అందిస్తున్నారు. కొంద‌రు టిక్ టాక్ వీడియోలు చేస్తూ అల‌రిస్తుంటే మ‌రి కొంద‌రు హెల్తీ రెసిపీలు, ఫిట్ నెస్ వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా త‌ర‌చు టిక్‌టాక్ వీడియోస్ చేస్తూ త‌న ఫ్యాన్స్‌కి లాక్‌డౌన్ స‌మ‌యంలో వినోదం అందిస్తుంది.

తాజాగా ఈ అమ్మ‌డు టిక్‌టాక్‌లో త‌న భ‌ర్తని కొడుతూ వీడియో షేర్ చేసింది. ఇందులో శిల్పా భ‌ర్త రాజ్ కుంద్రా త‌న‌తో పాటు త‌న మ‌నిషిని విసిగిస్తున్న‌ట్టు చేస్తుంటాడు. దీంతో ఒళ్ళు మండిన శిల్పా భ‌ర్త‌ని చిత‌క్కొడుతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది.logo