బుధవారం 03 జూన్ 2020
Cinema - May 11, 2020 , 13:12:18

సరోగ‌సీని ఎంచుకోవ‌డానికి కార‌ణం చెప్పిన శిల్పా శెట్టి

సరోగ‌సీని ఎంచుకోవ‌డానికి కార‌ణం చెప్పిన శిల్పా శెట్టి

రాజ్‌కుంద్రా- శిల్పా శెట్టి దంప‌తుల‌కి వియాన్ అనే కుమారుడు జ‌న్మించ‌గా, ఈ ఏడాది మొద‌ట్లో స‌మీషా అనే చిన్నారి స‌రోగ‌సీ ద్వారా జ‌న్మించింది. స‌మీషాలో  స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది అని శిల్పా శెట్టి ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రాములో తెలియ‌జేసింది. అయితే తాను రెండో సారి స‌రోగ‌సీ విధానాన్ని ఎంచుకోవ‌డానికి గ‌ల కార‌ణం వివ‌రించింది.

వియాన్ పుట్టిన త‌ర్వాత మాకు మ‌రో బేబీ కావాల‌ని అనిపించింది. నేను ప్ర‌గ్నెంట్ ఉన్న స‌మ‌యంలో అప్లా రోగ నిరోధ‌క వ్యాధితో బాధ‌ప‌డ్డాను. దాని వ‌ల‌న రెండు సార్లు గ‌ర్భ‌స్రావం అయింది. అయితే వియాన్‌ని ఒంటరిగా పెంచాల‌ని అనుకోలేదు. ఎందుకంటే తోబుట్టువ విలువ నాకు తెలుసు‌. అనేక మార్గాలు వెతికాను. ఏది వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో చిరాకు వ‌చ్చి  స‌రోగసీని ఎంచుకున్నాము అని తెలిపింది శిల్పా శెట్టి. మూడు ప్రయత్నాల తర్వాత సమీష పుట్టింది. రెండవ సంతానం కోసం ఐదేళ్లు వెయిట్ చేశాం అని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ‌


logo