శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 15:17:12

చ‌లికి వ‌ణుకుతూ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్న సాగ‌ర‌క‌న్య‌

చ‌లికి వ‌ణుకుతూ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్న సాగ‌ర‌క‌న్య‌

అల‌నాటి అందాల తార శిల్పా శెట్టి పెళ్లి త‌ర్వాత సినిమాల స్పీడ్ త‌గ్గించింది. అప్పుడప్పుడు అతిధి పాత్ర‌ల‌లో మెరుస్తూ అల‌రిస్తుంది. తాజాగా హంగామా 2 అనే చిత్రంలో కీల‌క పాత్ర చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ మ‌నాలీలో జ‌రుగుతుంది. దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత చిత్ర‌ షూటింగ్‌ని మొద‌లు పెట్ట‌గా, ప‌లువురు న‌టీన‌టులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. 

శిల్పా శెట్టి రీసెంట్‌గా త‌న చిత్ర బృందంతో క‌లిసి మ‌నాలీకి చేరుకోగా, అక్క‌డి విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి థ్రిల్ అందిస్తుంది. తాజాగా మ‌నాలీలోని చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో డైలాగ్ రిహార్స‌ల్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. చ‌లికి వ‌ణుకుతూ శిల్పా డైలాగ్ చెబుతుండ‌డాన్ని చూసిన ఫ్యాన్స్ అవాక్క‌వుతున్నారు. 

ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న  'హంగామా 2 ' చిత్రంలో  ప‌రేశ్ రావ‌ల్‌, మీజాన్ జాఫ్రే, ప్ర‌ణీత సుభాష్, శిల్పాశెట్టి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకోనుండ‌గా, థియేట‌ర్‌లోనే చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. logo