శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Feb 21, 2020 , 12:53:44

మా కుటుంబం ప‌రిపూర్ణం అయింది: శిల్పా శెట్టి

మా కుటుంబం ప‌రిపూర్ణం అయింది:  శిల్పా శెట్టి

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి శిల్పా శెట్టి .. వ్యాపార‌వేత్త‌ రాజ్‌కుంద్రాని వివాహం చేసుకున్న త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌ద‌మూడేళ్ళ‌కి పైగా వెండితెర‌కి దూరంగా ఉంటున్న శిల్పా సోష‌ల్ మీడియాలో ప‌లు ఆస‌నాల వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందాన్ని క‌లిగిస్తుంది. అయితే శిల్పా , రాజ్‌కుంద్రా దంప‌తుల‌కి ఇప్ప‌టికే కుమారుడు ఉండ‌గా, వారు  తాజాగా స‌రోగసీ ప‌ద్ద‌తిలో పండంటి ఆడ‌బిడ్డ‌ని త‌మ ఇంటికి ఆహ్వానించారు. ఫిబ్ర‌వ‌రి 15న జ‌న్మించిన‌ప్ప‌టికీ, ఈ రోజు శివ‌రాత్రి సంద‌ర్భంగా అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పారు. 

‘ఓం శ్రీ గ‌ణేషాయ న‌మః ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్‌ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి  వ‌చ్చింద‌నే విష‌యాన్ని మీతో షేర్ చేసుకోవ‌డం థ్రిల్లింగ్‌గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు: రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్‌‌’’అని శిల్పాశెట్టి తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. కాగా, శిల్పా .. నికమ్మ టైటిల్‌తో షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో త్వరలోనే  రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. logo