గురువారం 28 మే 2020
Cinema - Apr 27, 2020 , 10:58:43

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల మ‌ధ్య మ‌హాభార‌త యుద్ధం

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల మ‌ధ్య మ‌హాభార‌త యుద్ధం

లాక్‌డౌన్ స‌మ‌యంలో సినిమాలతో అల‌రించ‌క‌పోయినా, అంత‌కు మించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తున్నారు మ‌న సినీ సెల‌బ్రిటీలు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె భ‌ర్త రాజ్ కుంద్రా, వీరి ముద్దుల త‌న‌యుడు వియాన్ చిన్న పాటి మ‌హాభార‌త యుద్ధాన్ని ప్ర‌త్య‌క్షంగా చూపించారు. వీరి యుద్ధానికి సంబంధించిన వీడియో నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

నార‌దుడిగా మారిన వియాన్ త‌న తండ్రి ద‌గ్గ‌రకి వెళ్లి మీరు లావుగా ఉన్నారంటూ అమ్మ కామెంట్ చేసింద‌ని చెబుతాడు. అలానే త‌ల్లి ద‌గ్గ‌ర‌కి వెళ్ళి నువ్వు బ‌ద్ద‌క‌స్తురాలువని నాన్న అంటున్నార‌ని చెవిన ప‌డేస్తాడు. దీంతో ఇద్ద‌రు వీరావేశంతో ర‌గిలిపోతూ మోడ్ర‌న్ మ‌హాభార‌తాన్ని క‌ళ్ళ‌కి క‌ట్టిన‌ట్టు చూపించారు. ఇద్ద‌రూ బాణాలు విసురుకుని మరీ త‌మ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. అయితే ఇదంతా త‌మ బుడ‌త‌డి ప‌ని అని తెలుసుకున్న దంప‌తులు బాణాల‌ని వియాన్ వైపుకి విసురుతారు. స‌ర‌దాగా సాగిన ఈ  వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. logo