రాజ్‌కుంద్రా అశ్లీల కుంభకోణం కేసులో బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ను ముంబయ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రికార్డ్ చేశారు. ఇందులో ఆమె సంచలన విషయాల్ని బయటపెట్టినట్లు తెలిసింది. ఏప్రిల్ నెలలో రాజ్‌కుంద్రాపై కేసు పెట్టడానికి గల కారణాలు, అనంతర పరిణామాలపై పోలీసులు ఆమెను విచారించినట్లు సమాచారం. ఓ బిజినెస్ డీల్ కోసం ఏప్రిల్‌లో తన ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రా అసభ్యంగా ప్రవర్తించాడని షెర్లిన్‌చోప్రా చెప్పినట్లు తెలిసింది. తన భార్య శిల్పాశెట్టితో సంబంధాలు బాగా లేవని చెబుతూ తనను బలవంతంగా ముద్దాడడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. రాజ్‌కుంద్రా ప్రవర్తనతో తాను భయపడి వాష్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నానని షెర్లిన్ చోప్రా పోలీసులకు వివరించిందని చెబుతున్నారు. పోర్న్ కుంభకోణం కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో షెర్లిన్ చోప్రా కూడా విచారణను ఎదుర్కొంటున్నది.