ముంబై : బాలికా వధు ఫేమ్ నటుడు సిద్ధార్థ శుక్లా నిన్న గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇవాళ ముంబైలోని ఓషివరా శ్మశానవాటికలో శుక్లా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సిద్ధార్ధ అంత్యక్రియలకు ఆ నటుడి గర్ల్‌ఫ్రెండ్ షెహనాజ్ గిల్ హాజరైంది. సిద్ధార్ధకు ఫేర్వెల్ చెప్పేందుకు వచ్చిన షెహనాజ్ వెక్కివెక్కి ఏడ్చింది. బిగ్‌బాస్ 13 ఏపిసోడ్ సమయంలో సిద్ధార్ధ, షెహనాజ్ క్లోజ్ అయ్యారు. ఇద్దరూ ఫైనల్‌కు వెళ్లారు. అయితే ఆ ఎపిసోడ్లో సిద్ధార్ధ విన్నర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి అతనితో షెహనాజ్ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్మశానవాటిక వద్ద గుండెపేలిన షెహనాజ్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. సిద్ధార్థకు తుది వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇక ఆ యాక్టర్‌కు చెందిన అటాప్సీ నివేదికను డాక్టర్లు రహస్యంగా ఉంచారు. రసాయనిక విశ్లేషణ కోసం సిద్ధార్ధ విసెరా శ్యాంపిళ్లను ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది.