ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 19:48:56

'క్యా బాత్ హై' పాట‌కు షెహ్ నాజ్ స్టెప్పులు..వీడియో

'క్యా బాత్ హై' పాట‌కు షెహ్ నాజ్ స్టెప్పులు..వీడియో

ప్రముఖ మోడల్, నటి షెహ్ నాజ్ గిల్ సోషల్ మీడియాలో అప్ప‌డప్పుడు వీడియోలు షేర్ చేస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ అందాల న‌టి ఓ డ్యాన్సింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. హార్డీ సంధు పాడిన హిట్ ట్రాక్ క్యా బాత్ హై పాట‌కు రొమాంటిక్ ట‌చ్ ఇస్తూ..అద్భుత‌మైన హావ‌భావాల‌తో డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టింది. ఈ వీడియో ఇపుడు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. 

షెహ్ నాజ్ ఇటీవ‌లే తేరి ప్యారీ ప్యారీ దో అఖియాన్ అంటూ సాగే ఫేమస్ ట్రాక్ కు అద్బుతంగా నటిస్తూ..క్రేజీగా డ్యాన్స్ చేసిన డ‌బ్ స్మాష్ వీడియో షెహ్ నాజ్ ఫ్యాన్స్ పేజీలో పోస్ట్ కాగా..వైర‌ల్ అయింది. సిల్వర్ స్క్రీన్ పై తనను మిస్సవుతున్న అభిమానులకు వినోదాన్ని అందించేందుకు నేనున్నా అంటూ బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటికే తెలిపిన‌ షెహ్ నాజ్ ఇలా డ్యాన్సింగ్ వీడియాల‌తో అంద‌రినీ అల‌రిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo