ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 12:38:48

షెహ్ నాజ్ గిల్ క్రేజీ డ్యాన్స్ వీడియో చూడాల్సిందే

షెహ్ నాజ్ గిల్ క్రేజీ డ్యాన్స్ వీడియో చూడాల్సిందే

ప్రముఖ మోడల్, నటి షెహ్ నాజ్ గిల్ సోషల్ మీడియాలో మెస్మరైజ్ చేసే ఫొటోలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. యువరాణి లుక్ లో గార్జియస్ గా ఉన్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ అందాల భామ త్రోబ్యాక్ డబ్ స్మాష్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఫ్యాన్స్ పేజీలో పోస్ట్ చేశారు. తేరి ప్యారీ ప్యారీ దో అఖియాన్ అంటూ సాగే ఫేమస్ ట్రాక్ కు అద్బుతంగా నటిస్తూ..క్రేజీగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తోంది.

ముఖంలో భిన్నమైన హావభావాలను వ్యక్తీకరిస్తూ చేసిన డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సిల్వర్ స్క్రీన్ పై తనను మిస్సవుతున్న అభిమానులకు వినోదాన్ని అందించేందుకు నేనున్నా అంటూ బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటికే షెహ్ నాజ్ తెలిపింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo