పుణె: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో భారత బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. సిక్సర్ల వర్షాన్ని కురిపించిన స్టోక్స్ సెంచరీని త్రుటిలో చేజార్చుకున్నాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 52 బంతులు ఆడిన స్టోక్స్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 మాత్రమే బౌండరీలు ఉండగా, 10 సిక్సర్లు ఉండటం విశేషం. అంతకుముందు క్రునాల్ వేసిన 34వ ఓవర్లో స్టోక్స్ 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు పిండుకున్నాడు.
మరోవైపు బెయిర్ స్టో కూడా దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ 36 ఓవర్లకు 287/2తో నిలిచింది. అయితే మరుసటి ఓవర్ తొలి బంతికే సెంచరీ హీరో బెయిర్ స్టో (124) ను అవుట్ చేసిన ప్రసిధ్ నాలుగో బంతికి జాస్ బట్లర్ (0)ను పెవిలియన్ పంపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి