మంగళవారం 19 జనవరి 2021
Cinema - Nov 09, 2020 , 19:18:58

దుమ్ము లేపుతున్న శర్వానంద్ ‘శ్రీకారం’ సాంగ్.. భలేగుంది పాట..

దుమ్ము లేపుతున్న శర్వానంద్ ‘శ్రీకారం’ సాంగ్.. భలేగుంది పాట..

శర్వానంద్ అంటే కేవలం క్లాస్ హీరోగానే ముద్ర పడిపోయింది. మధ్యలో కొన్ని మాస్ సినిమాలు చేసినా కూడా ఈయన్ని మాత్రం ఫుల్ క్లాస్ అంటారు. పైగా ఆయన పాటలు కూడా అలాగే ఉంటాయి. చెప్పుకోడానికి కెరీర్ లో ఒక్కటంటే ఒక్క మాస్ పాట కూడా లేదు. పాపం అదే బాధ పడుతుంటారు ఆయన అభిమానులు కూడా. అయితే ఇప్పట్నుంచి ఆ అవసరం లేదు. వాళ్లకు ఆ లోటు తీర్చేసాడు పెంచల్ దాస్. అప్పుడెప్పుడో రెండేళ్ల కింద నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారిచూడు దుమ్ము చూడు అంటూ రచ్చ చేసాడు పెంచల్ దాస్. ఆయన పాటను విని ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది. ఇన్నాళ్లూ ఎక్కడుండిపోయావయ్యా అంటూ తెలుగు ఇండస్ట్రీకి ఆహ్వానం పలికారు. ఆ వెంటనే అరవింద సమేతలో కూడా రెండు పాటలు పాడి దుమ్ము దులిపేసాడు దాస్. అప్పట్నుంచి ఈయన కోసం మ్యూజిక్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. 

తాజాగా శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కిస్తున్న శ్రీకారం సినిమాలో ఓ పాటను స్వయంగా రాసి కంపోజ్ చేసి తనే పాడాడు పెంచల్ దాస్. ఇది ఇప్పుడు విడుదలైంది. వచ్చానంటివో పోతానంటివో వగలమారి బాల అంటూ ప్రోమో విడుదలైనపుడే ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చేసింది. అది చూసిన తర్వాత వామ్మో ఏంది పాట ఇలాగుంది.. భలేగుంది అంటూ మురిసిపోతున్నారు.. మళ్లీ మళ్లీ వింటున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నా కూడా ఈ పాటను మాత్రం పెంచల్ దాస్ రాసి కంపోజ్ చేసి పాడాడు. భలేగుంది బాలా అంటూ అలా విడుదలైందో లేదో ఇలా యూ ట్యూబ్ లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఈ పాట. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్.‌ 

ఆమె నడుము అందాలు కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణ. గ్యాంగ్ లీడర్ సినిమాలో నడుము కూడా చూపించలేదు ప్రియంక. కానీ ఇందులో పద్దతులు కాస్త పక్కకు జరిపింది. మరోవైపు శర్వానంద్ లుంగీ కట్టుకుని చేసిన మాస్ డాన్సులు..పెంచల్ దాస్ అదిరిపోయే వాయిస్.. లిరిక్స్ ఈ పాటను ఇన్‌స్టంట్ హిట్ చేసేసాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయేలా కనిపిస్తుంది. వ్యవసాయం నేపథ్యంలో శ్రీకారం సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు కిషోర్. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే విడుదల కానుంది శ్రీకారం. పడిపడి లేచే మనసు, రణరంగం, జాను లాంటి హ్యాట్రిక్ ఫ్లాపులతో వెనకబడిపోయిన శర్వా కెరీర్‌కు శ్రీకారం విజయం కీలకంగా మారింది.