మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 15, 2020 , 07:48:31

యూఎస్‌లో శ‌ర్వానంద్‌కి శ‌స్త్ర చికిత్స‌..!

యూఎస్‌లో శ‌ర్వానంద్‌కి శ‌స్త్ర చికిత్స‌..!

ప్రముఖ తెలుగు హీరో శర్వానంద్  జాను చిత్ర షూటింగ్‌లో భాగంగా గాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది థాయ్‌లాండ్‌లో  శిక్షకుల పర్యవేక్షణలో శ‌ర్వా  రెండు రోజులు స్కైడైవ్‌ ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు జాగ్రత్తగా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్లపై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అదుపు తప్పి భుజాలపై ల్యాండ్‌ అవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి. భుజానికి బ‌ల‌మైన గాయం కావ‌డంతో హైద‌రాబాద్‌లోని స‌న్‌షైన్ ఆసుప‌త్రిలో భుజానికి శ‌స్త్ర చికిత్స చేశారు. 

స‌ర్జ‌రీ త‌ర్వాత శ‌ర్వానంద్ వ‌రుస సినిమాల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. రీసెంట్‌గా జాను చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. దీని త‌ర్వాత కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే  భుజానికి అయిన గాయం తిర‌గ‌పెట్ట‌డంతో  శ‌ర్వానంద్ రీసెంట్‌గా యూఎస్ వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. స‌ర్జరీ త‌ర్వాత శ‌ర్వా తిరిగి హైద‌రాబాద్ రానున్నారు. కొద్ది రోజుల విశ్రాంతి త‌ర్వాత ఆయ‌న తిరిగి షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. 


logo