బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 17:12:48

జీహెచ్ఎంసీ పార్కుని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న శ‌ర్వానంద్

జీహెచ్ఎంసీ పార్కుని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న శ‌ర్వానంద్

హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కి మంచి స్పందన లభిస్తుంది. అనేక మంది సినీ సెల‌బ్రిటీలు ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తూ మొక్క‌లు నాటుతున్నారు. తాజాగా యువ హీరో శ‌ర్వానంద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బంజారాహిల్స్‌లోని త‌న ఇంటి ప‌క్క‌న పార్కులో మొక్క‌లు నాటాడు. భ‌విష్య‌త్ లో మ‌నం ఆక్సీజ‌న్ కొనుక్కునే ప‌రిస్థితి రావొచ్చు. దీనిని నిరోధించాలంటే మొక్క‌లు నాట‌డం ఒక్క‌టే ప‌రిష్కారం అని అన్నారు.

అంతేకాక ‌తన ఇంటి పక్కన ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కును దత్తత తీసుకొని, ఆ  పార్కులో వాకింగ్ ట్రాక్‌ ఏర్పాటుకు, పార్కు అభివృద్ధికి సొంత డబ్బులు ఖర్చు చేస్తాన‌ని అన్నారు శ‌ర్వానంద్‌. సంతోష్ అన్న చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఆయ‌నని స్పూర్తిగా తీసుకొని మొక్క‌లు నాటాను అని శ‌ర్వానంద్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శర్వానంద్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. 

 


logo