ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 07:47:27

రూ.50 జ‌రిమానా స‌రిపోదు, క‌ఠినంగా శిక్షించాలి: శ‌్ర‌ద్ధా

రూ.50 జ‌రిమానా స‌రిపోదు, క‌ఠినంగా శిక్షించాలి: శ‌్ర‌ద్ధా

బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంతు ప్రేమికురాలు అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. మూగ‌జీవాల‌కు ఎవ‌రైన హాని త‌ల‌పెట్టిన దృశ్యాలు ఏవైన త‌న ద‌గ్గ‌ర‌కి వస్తే వెంట‌నే రియాక్ట్ అవుతుంది. క‌ఠినంగా శిక్షించాలంటూ త‌న వాయిస్ ‌గ‌ట్టిగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు చ‌ట్టాల ప్ర‌కారం మూగ జీవాల‌ని హింసించే వారికి రూ. 50 రూపాయ‌ల జ‌రిమాని విధిస్తున్నారు. ఇది ఏ మాత్రం స‌రిపోదు.

జంతువుల‌ని హింసించే వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేయాల‌ని , ఇందుకోసం ఈ పిటీష‌న్‌పై ప్ర‌తి ఒక్క‌రు సంత‌కం చేయాల‌ని కోరుతుంది శ్ర‌ద్ధా . ఈ విష‌యంలో త‌న‌కు మ‌ద్ధ‌తు అందించాలని టైగ‌ర్ ష్రాఫ్‌, దిశా ప‌టానీని కూడా కోరింది. శ్రద్దా క‌పూర్‌కు నెటిజ‌న్స్ నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇదిలా ఉంటే శ్ర‌ద్దా క‌పూర్ సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ని కూడా ప‌ల‌క‌రించిన సంగ‌త తెలిసిందే. 

VIDEOS

logo