శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 00:03:24

శరణ్‌ను కూడా ఆదరించాలి: సూపర్‌స్టార్‌ కృష్ణ

శరణ్‌ను కూడా ఆదరించాలి: సూపర్‌స్టార్‌ కృష్ణ

సూపర్‌స్టార్‌ కృష్ణ - విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. వీరి మనవడు శరణ్‌ ‘దిలైట్‌'కుమార్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న నూతన చిత్రం విజయదశమి పర్వదినాన ప్రారంభమైంది.మాన్విత, కుశలకుమార్‌ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్‌ పతాకంపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్‌, వెంకట్‌ బులేమని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో శరణ్‌, నటుడు జెమిని సురేష్‌లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి హీరోలు సుధీర్‌బాబు, విజయకృష్ణ నవీన్‌ కెమెరా స్విఛాన్‌ చేయగా, నటుడు వీకే నరేష్‌ క్లాప్‌ ఇచ్చారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్‌ నటుడు కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘మా కుటుంబం నుంచి వచ్చిన అందరి హీరోలను ప్రేక్షకులు ఆదరించారు. శరణ్‌ కూడా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటాడనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: డాక్టర్‌ చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: సురేష్‌ గంగుల, ఛాయాగ్రహణం: భరద్వాజ్‌.