గురువారం 28 మే 2020
Cinema - Apr 27, 2020 , 12:59:36

‘శంకరాభరణం’ కష్టాలు!

‘శంకరాభరణం’ కష్టాలు!

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకరాభరణం’ చిత్రం ఓ కళాఖండం. ఇదొక అద్భుతమైన చిత్రమని అందరూ ప్రశంసిస్తుంటారు. కానీ ఈ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు  ఎదురయ్యాయో ఎవరికీ తెలియదు. సినిమా కష్టాలను చిత్ర నిర్మాత ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.  ‘శంకరాభరణం చిత్రంలో నటీనటుల్ని ఎన్నుకోవడమే పెద్ద సాహసం. శంకరశాస్త్రి పాత్రకు మొదట్లో జేవీ సోమయాజులు పేరు పరిశీలనలో లేదు. అక్కినేని నాగేశ్వరరావు, శివాజీగణేషన్‌ ఇలా పలువురిని మొదట్లో అనుకున్నాం. కానీ విశ్వనాథ్‌ గారు మాత్రం ఇమేజ్‌ వున్న నటులైతే పాత్ర హైలైట్‌ కాదు, తేలీపోతుందని అనడంతో జేవీ సోమయాజులును ఎంపికచేశాం. పాత్ర కోసం గుండు కూడా చేయించుకున్నాడు ఆయన. ఇక ముంజుభార్గవిని కూడా అప్పటి వరకు వ్యాంప్‌ పాత్రలు చేసిన ఆమె పేరును కళాతపస్వి సూచించారు. మాకయితే అసలు ఊహకు కూడా అందని విషయమిది.

ఇక చిత్రీకరణ ముగిసిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. సినిమా చూసి అద్భుతం అని ప్రశసించేవారే తప్ప కొనుక్కోవడానికి ముందుకొచ్చిన వాళ్లు లేరు. ఒక వైపు విడుదల తేదీ ప్రకటించాం. ఫైనాన్స్‌ చెల్లించనిదే బాక్స్‌లు బయటికి రావు. ఇక విడుదల తేదీ రెండు రోజులు వుందనగా ఓ డిస్ట్రిబ్యూటర్‌ ముందుకు రావడంతో రెండు ఏరియాలను వుంచుకుని మిగతా ఏరియాలు అమ్మేశాం. తొలి నాలుగు రోజులు వసూళ్లు రాలేదు. ఐదో రోజు నుంచి వసూళ్ల వర్షం మొదలైంది. ఆ తర్వాత శంకరాభరణం ఓ చరిత్రలా నిలిచింది’ అని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.


logo