శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 11:56:57

భారీ మ‌ల్టీ స్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్న శంక‌ర్..!

భారీ మ‌ల్టీ స్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్న శంక‌ర్..!

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ఒక‌రు. ఆయ‌న తీసిన సినిమాలు భార‌తీయ సినిమా స్థాయిని మ‌రింత‌గా పెంచాయి. శంక‌ర్ సినిమా అంటే కోట్ల‌లో బిజినెస్ న‌డుస్తుంది. అయితే ఇటీవ‌లి కాలంలో కాస్త గాడి త‌ప్పిన శంక‌ర్‌కు అదృష్టం కూడా క‌లిసి రావ‌డం లేదు. క‌మ‌ల్ హాస‌న్‌తో భార‌తీయుడు 2 చిత్రం తెర‌కెక్కించి మ‌ళ్ళీ ట్రాక్ ఎక్కాల‌ని భావించ‌గా, ఈ సినిమాకు మోక్షం రావ‌డం లేదు. షూటింగ్ మొద‌లు పెట్టిన కొద్ది రోజుల‌కు సెట్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం, ఆ త‌ర్వాత క‌రోనా రావ‌డం, క‌మ‌ల్ కాలుకి శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌డం ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్‌కు అడ్డంకిగా మారాయి.

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల త‌ర్వాతే ఇండియ‌న్ 2 సినిమా మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ లోపు ఓ మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకు సంబంధించి ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అనుకుంటున్నాడ‌ట. ఆ మ‌ధ్య  పవన్, రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ సినిమా ఉండబోతుందని తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా రామ్ చ‌ర‌ణ్‌, య‌ష్ హీరోలుగా శంక‌ర్ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో ఈ సినిమా రానుంద‌ని టాక్స్ వినిపిస్తుండ‌గా, దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో చూడాలి.  

VIDEOS

logo